బాలీవుడ్ లో మరింత బోల్డ్ గా తమన్నా !
ఇతర నటీమణులు 40 ఏళ్ల వయసులో అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే.. తమన్నా మాత్రం బాలీవుడ్‌లో సినిమాలు, పాటలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ గతంలో ఎప్పుడూ లేనంత హాట్‌గా కనిపిస్తోంది.;
మిల్కీ బ్యూటీ తమన్నాకి 35 ఏళ్లు. అయినప్పటికీ.. ఆమె ఇంకా సినిమాలతో బిజీగా ఉంది. గతంలో ఆమె గ్లామరస్ పాత్రలు చేయలేదు కానీ.. ఇప్పుడు మాత్రం అటువంటి పాత్రలపై దృష్టి పెట్టింది. ఐటమ్ నంబర్స్, స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఆమెకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఆమె చేసిన ఇటీవలి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచిన తర్వాత.. ఐటమ్ సాంగ్స్ కోసం ముందుగా పరిశీలిస్తున్న పేరు తమన్నానే.
ఇతర నటీమణులు 40 ఏళ్ల వయసులో అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే.. తమన్నా మాత్రం బాలీవుడ్‌లో సినిమాలు, పాటలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ గతంలో ఎప్పుడూ లేనంత హాట్‌గా కనిపిస్తోంది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రైడ్ 2' సినిమాలోని 'నషా' పాట, 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'లోని 'గఫూర్' పాటలు సూపర్ హిట్టయ్యాయి. తమన్నా డ్యాన్స్ మూమెంట్స్, ఆమె గ్లామరస్ ప్రదర్శనలు వైరల్ అయ్యాయి.
ఈ వయసులో కూడా తమన్నా చాలా ఫిట్‌గా, హాట్‌గా కనిపిస్తోంది. తెరపై తన అందాలను ప్రదర్శించడానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. తమన్నా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నా.. ఆమెకు ఉన్న డిమాండ్ కారణంగా నిర్మాతలు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఏ సినిమాకు సంతకం చేయలేదు, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.