చరిత్ర సృష్టించిన దీపికా పదుకొణే

మెటా ఏఐకి వాయిస్ ఇచ్చిన మొదటి ఇండియన్ సెలబ్రిటీగా దీపికా రికార్డ్ సృష్టించింది. ఆమె వాయిస్ వాట్సాప్, రే బ్యాన్, మెటా స్మార్ట్ గ్లాసెస్, ఇన్ స్టా గ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఇంటిగ్రేట్ కానుంది.;

By :  K R K
Update: 2025-10-16 13:10 GMT

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొణే రీసెంట్‌గా చాలా విషయాల వల్ల ఇప్పుడు న్యూస్‌లో ఉంది. వాటిలో ఎక్కువగా మాట్లాడుకున్నది.. ప్రభాస్ హీరోగా వస్తున్న 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి ఆమె ఔట్ అయిందనే విషయం. ఇక ఇప్పుడు, ఆమె ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్ వల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

అదేంటంటే.. మెటా ఏఐకి వాయిస్ ఇచ్చిన మొదటి ఇండియన్ సెలబ్రిటీగా దీపికా రికార్డ్ సృష్టించింది. ఆమె వాయిస్ వాట్సాప్, రే బ్యాన్, మెటా స్మార్ట్ గ్లాసెస్, ఇన్ స్టా గ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఇంటిగ్రేట్ కానుంది. ఇంతకుముందు జాన్ సెనా, జూడి డెంచ్, ఆక్వాఫినా వంటి సెలబ్రిటీలు కూడా మెటా ఎఐకి వాయిస్ ఇచ్చారు.

ప్రస్తుతానికి దీపికా వాయిస్ ఇండియా, యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్‌లో అందుబాటులో ఉంది. ఇంక దీపిక సినిమాల విషయానికి వస్తే.. ఈ 'బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబోలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. 

Tags:    

Similar News