‘హరి హర వీరమల్లు‘ నుంచి బాబీ డియోల్ లుక్!

సౌత్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న బాబీ డియోల్ కిట్టీలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు‘ ఒకటి. ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో కనిపించబోతున్నాడు బాబీ డియోల్.;

By :  S D R
Update: 2025-01-27 06:58 GMT

బాబీ డియోల్ కి బాలీవుడ్ లో కెరీర్ ఇక లేదు అనుకున్న సమయంలో వచ్చింది ‘యానిమల్‘ చిత్రం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో హీరోగా రణ్ బీర్ కపూర్ కి ఎంత పేరొచ్చిందో.. విలన్ గా బాబీ డియోల్ కి అంతకు మించి పేరొచ్చింది. అది కూడా ఇప్పుడు దక్షిణాదిన బాబీ డియోల్ బాగా బిజీ అవ్వడానికి కారణమైంది.


సౌత్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న బాబీ డియోల్ కిట్టీలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు‘ ఒకటి. ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో కనిపించబోతున్నాడు బాబీ డియోల్. ఈరోజు (జనవరి 27) బాబీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘హరి హర వీరమల్లు‘ నుంచి బాబీ డియోల్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘హరి హర వీరమల్లు‘ పార్ట్ 1 ‘స్వార్డ్స్ వర్సెస్ స్పిరిట్‘ మార్చి 28న విడుదలకానుంది.

Tags:    

Similar News