రెండో రోజు కూడా బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్!
యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా, రెండో రోజున కూడా అదే జోరును కొనసాగించింది.;
యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా, రెండో రోజున కూడా అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ ఉండటం విశేషం.
మొత్తంగా రెండు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు రూ.9.55 కోట్లు షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో ఇప్పటికే 850 కె డాలర్ల వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీ ఈరోజుతో అమెరికాలో 1 మిలియన్ డాలర్లను క్రాస్ చేయనుంది.
ఈ వసూళ్లు చూస్తుంటే ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా భారీ హిట్ దిశగా దూసుకుపోతుందని స్పష్టంగా అర్థమవుతోంది. రోజురోజుకు సినిమాకు పెరుగుతున్న పాజిటివ్ బజ్, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం!