మరోసారి బాలకృష్ణ-మలినేని!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కిట్టీలో కొత్త సినిమా చేరింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్'తో బడా హిట్ అందుకున్న బాలయ్య.. దసరా కానుకగా 'అఖండ 2'ని రెడీ చేస్తున్నాడు.;
By : S D R
Update: 2025-04-19 05:50 GMT
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కిట్టీలో కొత్త సినిమా చేరింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్'తో బడా హిట్ అందుకున్న బాలయ్య.. దసరా కానుకగా 'అఖండ 2'ని రెడీ చేస్తున్నాడు. ఇక 'అఖండ 2' తర్వాత బాలయ్య చేయబోయే సినిమా కన్ఫమ్ అయ్యింది. తనకు ఇప్పటికే 'వీరసింహారెడ్డి' వంటి విజయాన్నందించిన మలినేని గోపీచంద్ తో మరో మూవీ చేయబోతున్నాడు.
ఈ ఏడాది జూన్ లో బాలయ్య బర్త్ డే స్పెషల్ గా మలినేని గోపీచంద్ సినిమాని ప్రకటించనున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నట్టు మలినేని తెలిపాడు. ఇటీవలే బాలీవుడ్ లో 'జాట్'తో బడా హిట్ అందుకున్నాడు మలినేని. లేటెస్ట్ గా 'జాట్'కి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే బాలకృష్ణ సినిమా పూర్తైన తర్వాతే 'జాట్ 2' సెట్స్ పైకి వెళ్లనుందట.