'అఖండ 2'లో 'బజరంగీ' బేబీ!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటిస్తున్న క్రేజీ సీక్వెల్ 'అఖండ 2'. 2021లో రిలీజై సెన్సేషనల్ హిట్ అయిన 'అఖండ'కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.;

By :  S D R
Update: 2025-07-02 13:38 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటిస్తున్న క్రేజీ సీక్వెల్ 'అఖండ 2'. 2021లో రిలీజై సెన్సేషనల్ హిట్ అయిన 'అఖండ'కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాల్గవ చిత్రం ఇది. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనుండగా, వాటిలో ఒకటి అఘోర పాత్ర. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీలో బాలీవుడ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా.. జనని అనే కీలక పాత్రలో కనిపించనున్నట్టు ప్రకటించింది టీమ్. ‘అఖండ’ ఫస్ట్ పార్ట్ లో కనిపించిన చిన్నారి పాత్రే ఇదని తెలుస్తోంది. హర్షాలీ మల్హోత్రా బాలనటిగా బాలీవుడ్ లో 'బజరంగీ భాయిజాన్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తేజస్విని నందమూరి ఈ సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న 'అఖండ 2' రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags:    

Similar News