'బాహుబలి' తిరిగి వస్తున్నాడు…!

Update: 2025-05-05 08:34 GMT

దశాబ్ద కాలంగా భారతీయ చలనచిత్ర ప్రపంచాన్ని ఊపేసిన పీరియడ్ యాక్షన్ మూడీ ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన పాన్-ఇండియా హిట్‌గా నిలిచింది.




ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, సత్యరాజ్, రమ్యకృష్ణ, తమన్నా భాటియా వంటి దిగ్గజ నటీనటులు ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ఈ అక్టోబర్ కి సరిగ్గా 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యం లో ఈ సినిమాను మళ్లీ పెద్ద తెరపై విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అక్టోబర్ 2025లో సినిమా తిరిగి విడుదల కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు మేకర్స్. "బాహుబలి మళ్లీ బిగ్ స్క్రీన్ పైకి వస్తున్నాడు…. ఈ అక్టోబర్‌లో మరింత గొప్పగా జరుపుకుందాం. జై మాహిష్మతి…” అంటూ క్యాప్షన్‌ పెట్టారు.

Tags:    

Similar News