సైఫ్ అలీ ఖాన్ పై దాడి... 8 సినిమాల పై ప్రభావం
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబై లోని బాంద్రా నివాసంలో ఓ వ్యక్తి చేతిలో దాడికి గురయిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల సైఫ్.. హిందీ సినిమా పరిశ్రమతో పాటు దక్షిణ భారత చిత్రాల్లో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఈయన జరిగిన ఈ దాడి .. ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ పై ప్రభావం పడే అవకాశముంది. ప్రస్తుతం సైఫ్ ‘జువెల్ థీఫ్: ది రెడ్ సన్ చాప్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్‌ను ఆసుపత్రిలో చూసేందుకు ఈ దర్శకుడు కూడా వెళ్లారు. ప్రస్తుతం సైఫ్ కు ఎనిమిది చిత్రాలు పైనే చర్చలు జరుగుతున్నాయి.
గత ఏడాది నిర్మాత రమేశ్ టౌరానీ, సైఫ్‌ను ‘రేస్ 4’ కోసం తీసుకురావడం సంచలనం సృష్టించింది. తొలి రెండు రేస్ చిత్రాల్లో భాగమైన సైఫ్, మూడవ భాగంలో సల్మాన్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేశారు. ‘రేస్ 4’ కోసం సైఫ్ షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంలో తెలుగు సూపర్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ముఖ్యమైనది. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆయన ‘దేవర: పార్ట్ 2’ చిత్రంలో విలన్ గా కంటిన్యూ చేయబోతున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, భారీ యాక్షన్ నేపథ్యంతో రూపొందుతోంది.
ఇవేకాకుండా, తమిళ దర్శకుడు బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందనున్న క్లిక్ శంకర్, ప్రియదర్శన్‌తో ఓ చిత్రం, అలాగే సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ‘షూటౌట్ ఎట్ బైకుల్లా’ వంటి చిత్రాలు కూడా సైఫ్ చేతిలో ఉన్నాయి. తన కుమార్తె సారా అలీ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసే ప్రాజెక్ట్ గురించి ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా స్పష్టత లేదు.
డాక్టర్ల సమాచారం ప్రకారం .. సైఫ్‌కు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. దాడి సమయంలో ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన మూడు అంగుళాల పొడవు ఉన్న పదార్థాన్ని తొలగించారు. తర్వాత ఆయనకు కాస్మెటిక్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతానికి ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. ఆయన ప్రాజెక్టులన్నీ ఈ దాడి ప్రభావంతో మార్పులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, అభిమానులు సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.