'శర్వా38'లో అనుపమ!
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి.;
By : S D R
Update: 2025-04-26 09:43 GMT
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి. సంపత్ నంది స్టైల్ యాక్షన్ కి తోడు పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్సయ్యింది. మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. అంతేకాకుండా ఆమెకు సంబంధించి ఓ ప్రీ-లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
గతంలో శర్వానంద్, అనుపమ జంటగా నటించిన 'శతమానం భవతి' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమ కుటుంబ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది. ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ తన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మాస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.