మెగాస్టార్ కి మరో హీరోయిన్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.;
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తిచేసుకుంటుంది. లేటెస్ట్ గా ఈ మూవీలో మిగతా కాస్టింగ్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడట అనిల్ రావిపూడి.
‘సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాలో వెంకీకి జోడీగా ఇద్దరు నాయికలు ఉన్నారు. ఇప్పుడు చిరు సినిమాకీ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడట అనిల్. ఇప్పటికే చిరంజీవికి జోడీగా నయనతార ఒక నాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది. మరో కథానాయికగా కేథరిన్ ను తీసుకోబోతున్నారట.
మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో, సరైనోడు‘ వంటి రెండు సినిమాల్లో నటించింది కేథరిన్. ఇక.. ‘సరైనోడు‘లో ఎమ్మేల్యే పాత్రలో గ్లామరస్ గా అదరగొట్టింది. ఇప్పుడు చిరు సినిమాలోనూ కేథరిన్ అలాంటి రోల్ లోనే అలరించనుందట. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.