రామ్ కోసం అనిరుధ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది.;

By :  S D R
Update: 2025-07-15 10:35 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. జూలై 18న ఈ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ వివేక్ – మెర్విన్ జోడీ కంపోజ్ చేసిన ఈ సింగిల్ ను హీరో రామ్ స్వయంగా రాయడం విశేషం.

అయితే.. ఈ పాటను కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ పాడటం ఇప్పుడు మరో విశేషంగా మారింది. మెలోడియస్ గా సాగే ఈ గీతం ఎంతగానో ఆకట్టుకుంటుందని చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

ఈ సినిమాలో రామ్ ఓ హీరోకి అభిమానిగా నటిస్తున్నాడు. రామ్ లుక్ ఎంతో రిఫ్రెషింగ్ గా కనిపిస్తుంది. రామ్ కి జోడీగా భాగ్యశ్రీ నటిస్తుంటే.. ఇతర కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపించనున్నాడు.

Tags:    

Similar News