రంభ, ఊర్వశి, మేనక అంటోన్న అల్లరోడు!
‘నాంది’ సినిమా నుంచి సీరియస్ రోల్స్ వైపు టర్న్ అయ్యాడు అల్లరి నరేష్. ఈకోవలోనే ‘మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, నా సామిరంగ, బచ్చలమల్లి’ వంటి సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ లో మెప్పించాడు.;
‘నాంది’ సినిమా నుంచి సీరియస్ రోల్స్ వైపు టర్న్ అయ్యాడు అల్లరి నరేష్. ఈకోవలోనే ‘మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, నా సామిరంగ, బచ్చలమల్లి’ వంటి సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ లో మెప్పించాడు. అయితే ఇప్పుడు మళ్లీ తన స్ట్రాంగ్ జానర్ అయిన కామెడీకి తిరుగొస్తున్నాడు.
లేటెస్ట్ గా అల్లరి నరేష్ కొత్త సినిమాకి ‘రంభ ఊర్వశి మేనక’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. టైటిల్ చూస్తే ఇది సోషియో-ఫాంటసీ అనిపించినా, నిజానికి ఇది పూర్తి వినోదాత్మక కథగా ఉండనుందని సమాచారం. ‘రాధ’ మూవీ ఫేమ్ చంద్రమోహన్ ఈ సినిమాకి దర్శకుడు.
ప్రస్తుతం నరేష్ నటిస్తున్న ‘12ఏ – రైల్వే కాలనీ’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. దీంతో త్వరలోనే ‘రంభ ఊర్వశి మేనక’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. ఇక.. ‘రంభ ఊర్వశి మేనక‘ టైటిల్ వెనుక గల అసలు అర్థం ఏంటన్నది మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది.