జార్జియాలో ‘అఖండ 2‘ యాక్షన్
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ - మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2‘. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ కాంబో ఇప్పుడు ‘అఖండ 2‘తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు.;
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ - మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2‘. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ కాంబో ఇప్పుడు ‘అఖండ 2‘తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ప్రయాగ్‌రాజ్ వంటి ప్రదేశాల్లో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. లేటెస్ట్ గా జార్జియాలో చిత్రబృందం సందడి చేస్తుంది. అక్కడ అందమైన లొకేషన్లలో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేపట్టింది టీమ్. బాలకృష్ణపై కొన్ని పవర్‌పుల్ ఫైట్ సీక్వెన్సులు విదేశీ ఫైటర్స్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా పాత్రలో కనిపించబోతున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ‘అఖండ 2‘ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది. అయితే ఆ తేదీ నుంచి ఈ చిత్రం వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతుంది.