'కూలీ' నుంచి అమీర్ లుక్!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’.;
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, పూజా హెగ్డే వంటి పలువురు స్టార్స్ కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.వీరితో పాటు.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నాడనే న్యూస్ చాన్నాళ్లుగా వినిపిస్తుంది. లేటెస్ట్ గా అమీర్ 'కూలీ'లో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్.
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ దహా (Dahaa) అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఈ లుక్ లో అమీర్ ఖాన్ అదరగొడుతున్నాడు. ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్ లో 'కూలీ' సినిమా విడుదలవుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం తెలుగు రైట్స్ రికార్డు ప్రైస్ కు అమ్ముడయ్యాయి. లేటెస్ట్ గా 'కూలీ' ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రూ.86 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ తమిళ సినిమాల్లో ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డు గా ప్రచారం జరుగుతుంది.