ఆమిర్ ఖాన్ హీరో గా లోకేష్ ఫాంటసీ మూవీ?
తమిళ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ దర్శకుడు, కూలీ తర్వాత వరుసగా సీక్వెల్ చిత్రాలపై దృష్టి సారించనున్నాడు. కార్తీతో ఖైదీ 2, కమల్ హాసన్‌తో విక్రమ్ 2, సూర్యతో రోలెక్స్ కథలపై ఇప్పటికే పనులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా లోకేష్ మరో ప్రత్యేకమైన స్క్రిప్ట్‌పై కూడా పనిచేస్తున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఆమీర్ ఖాన్ నటించే అవకాశముందని టాక్. ఇది ఫాంటసీ నేపథ్యంలో రూపొందించ బడుతోందని, భారీ వీఎఫ్ఎక్స్‌తో సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారట.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే కథతో సూర్యను కథానాయకుడిగా తీసుకుని లోకేష్ తన తొలి చిత్రంగా తెరకెక్కించాలనుకున్నారు. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా అది జరిగే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.