‘హిట్-3’లో కొత్త ట్విస్ట్!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా రాబోతోంది.;

By :  S D R
Update: 2025-04-03 01:19 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా రాబోతోంది. నాని ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర రక్తసిక్తమైన ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగేలా ఉంటుందని ప్రచార చిత్రాలతో అర్థమవుతుంది.

'హిట్' ఫ్రాంచైజీ తొలి చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. రెండో సినిమాకోసం అడవి శేష్ ఆన్‌బోర్డులోకి వచ్చాడు. ఇప్పుడు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ లో నాని నటిస్తుంటే.. ఫోర్త్‌ పార్ట్ కోసం మరో స్టార్ రంగంలోకి దిగబోతున్నాడట. ఇటీవల నాని 'హిట్ 3'లో ఓ స్టార్ హీరో కేమియో ఉంటుందని.. అది 'హిట్ 4'కి లీడ్ గా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు.

తాజాగా ఈ క్యామియో రోల్‌లో కోలీవుడ్ స్టార్ కార్తీ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కార్తీ ‘సర్దార్-2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మొత్తంగా 'హిట్' ఫ్రాంఛైజీలోకి కార్తీ ఎంట్రీ ఇస్తే.. దాని పరిధి మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News