ఘట్టమనేని వారసుడు సినిమాకి సన్నాహాలు

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త వారసుడు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.;

By :  S D R
Update: 2025-05-19 11:16 GMT

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త వారసుడు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘RX 100‘ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

అజయ్ భూపతి గతంలో ‘RX 100, మహా సముద్రం, మంగళవారం‘ వంటి సినిమాలతో తనదైన మార్క్‌ను చూపించాడు. ఇప్పుడు జయకృష్ణతో కూడా ఓ విలక్షణమైన కథను తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాను ప్రతిష్ఠాత్మక సంస్థలు వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

Tags:    

Similar News