మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
టాలీవుడ్‌లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు పొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నాదమ్ములుగా నటించిన ఈ చిత్రం 2013లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ సాధించింది.
కుటుంబ విలువలు, అనుబంధాలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. అన్నాదమ్ములుగా వెంకీ, మహేష్ నటనతో పాటు అందమైన గోదావరి ప్రాంత నేపథ్యం, అద్భుతమైన పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. లేటెస్ట్ రీ-రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా ఈ సినిమాను మళ్లీ బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు దిల్‌రాజు. మార్చి 7న ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ కాబోతుంది.