వాస్తవ సంఘటనలతో వస్తోన్న ‘23‘!

By :  T70mm Team
Update: 2025-03-08 08:17 GMT

‘మల్లేశం, 8 AM మెట్రో‘ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. ‘23‘ అనే టైటిల్ తో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుసగా కంటెంట్‌ డ్రివెన్ మూవీస్ ను అందిస్తూ వస్తోన్న రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం విశేషం. తాజాగా ‘23‘ చిత్రం టీజర్ రిలీజయ్యింది.

‘23‘.. ‘మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా‘ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మూడు మారణహోమ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. 1991లో జరిగిన చుండూరు హత్యాకాండ, 1993 చిలకలూరిపేట బస్సు దహనం ఘటన, 1997 జూబ్లీహిల్స్ కార్ బాంబ్ పేలుడు – ఈ మూడు సంఘటనలను కలిపి కథగా మలిచాడు డైరెక్టర్ రాజ్.

టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా దర్శకుడి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ సంఘటనల వెనుక ఉన్న నిజాన్ని అన్వేషిస్తూ, బాధితుల న్యాయపోరాటాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News