‘భద్ర‘ చిత్రానికి 20 ఏళ్లు
మాస్ డైరెక్టర్ గా ప్రశంసలు పొందుతున్న బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు. బోయపాటి తొలి చిత్రం ‘భద్ర‘ 2005, మే 12న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.;
మాస్ డైరెక్టర్ గా ప్రశంసలు పొందుతున్న బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు. బోయపాటి తొలి చిత్రం ‘భద్ర‘ 2005, మే 12న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. రవితేజ హీరోగా శ్రీవెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘భద్ర‘ కథా నేపథ్యం విషయానికొస్తే ఇదొక ఫ్యాక్షన్‌తో కూడిన ప్రేమకథ. ఈ మూవీలో రవితేజ ఒకవైపు కామెడీని పండిస్తూనే.. మరోవైపు రొమాన్స్, యాక్షన్ లో చెలరేగిపోయాడు. రవితేజాకి జోడీగా మీరా జాస్మిన్ నటించింది. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, సునీల్, అర్జన్ బజ్వా, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, సుబ్బరాజు వంటి వారు కనిపించారు.
ముత్యాల సుబ్బయ్య వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన బోయపాటి.. తన బంధువు కొరటాల శివతో కలిసి ‘భద్ర’ కథను రాసుకున్నాడు. తొలుత ఈ కథను ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో చేద్దామనుకున్నాడు. కానీ.. అల్లు అర్జున్ సలహా మేరకు చివరకు రవితేజ వద్దకు వెళ్లింది.
‘భద్ర’ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో ప్లస్ పాయింట్. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మొత్తంగా.. బోయపాటి శ్రీనుకి దర్శకుడిగా ‘భద్ర‘ గ్రేట్ డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన మాస్ బాటలో బోయపాటి దర్శకుడిగా ఎలా ఎదిగాడన్నదే తెలిసిందే.