దర్శకుడిగానూ అదరగొడుతోన్న ధనుష్ !

By :  T70mm Team
Update: 2025-02-22 11:51 GMT

దర్శకుడిగానూ అదరగొడుతోన్న ధనుష్ !తమిళ హీరోలు తరచుగా తమ సొంత పరిధిని దాటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో స్టార్ హీరో ధనుష్ ఒకడు. కోలీవుడ్ అగ్ర నటుడిగా ఎదిగి, ఇప్పుడు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. అతడు దర్శకత్వం వహించిన తాజా టీన్ లవ్ డ్రామా ‘నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం’ తెలుగులో "జాబిల్లి నీకు అంత కోపమా" పేరుతో అనువాదమై ఫిబ్రవరి 21న విడుదలైంది. చిన్న చిత్రంగా విడుదలైనప్పటికీ, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన దక్కించుకుంది.

ధనుష్ కుర్రతనం, ప్రేమ, భావోద్వేగాలను చక్కగా మేళవించి కథను ఎంతో అందంగా మలిచాడు. అతని దృశ్య మౌలికత, కథన విధానం, మనసును హత్తుకునే విధంగా ఉండటం అందరికీ నచ్చిన అంశంగా మారింది. ధనుష్ సాధారణంగా నటుడిగా గంభీరమైన పాత్రలు పోషిస్తుంటాడు. కానీ దర్శకుడిగా మాత్రం పూర్తి భిన్నంగా, చిన్న విషయాల్లో గొప్ప భావోద్వేగాలను తేవడంలో నైపుణ్యం చూపాడు. ఈ సినిమా క్రమంగా ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ, ధనుష్‌లో ఉన్న దర్శక ప్రతిభను ఋజువు చేసింది.

ఇప్పటికే నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ధనుష్, ఇప్పుడు దర్శకుడిగానూ ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న కథను ఎంత హార్ట్ టచింగ్ గా , సహజంగా చెప్పగలిగాడో ఈ చిత్రం చాటి చెప్పింది. ఆ ప్రతిభా వైవిధ్యమే ధనుష్‌ను ఓ ప్రత్యేకమైన ఫిల్మ్ మేకర్ గా నిలబెట్టిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News

Ask Me Anything : Samantha