‘దృశ్యం 3’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అజయ్ దేవ్‌గన్ !
2015లో విజయ్ సల్గావంకర్ పాత్రలో అజయ్ దేవ్‌గన్ నటించిన ‘దృశ్యం’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఏడు సంవత్సరాల తరువాత, 2022లో వచ్చిన ‘దృశ్యం 2’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు, 2025లో ‘దృశ్యం 3’ కోసం అజయ్ దేవ్‌గన్ మరోసారి సిద్ధమవుతున్నారని టాక్.
తాజా సమాచారం ప్రకారం.. అజయ్ దేవ్‌గన్ ఇటీవలే ‘దృశ్యం 3’ కథను విన్న తర్వాత వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు ఆయన ఈ జూలై . ఆగస్టు మాసాల్లో మరొక ప్రాజెక్ట్ చేయాలని భావించారు. కానీ.. ‘దృశ్యం 3’ కథ ఆయనను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ చిత్రాన్ని ముందుగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అభిషేక్ పాఠక్, రచయితలు కలిసి కథను వినిపించగా, అజయ్ దేవ్‌గన్ స్క్రిప్ట్‌లోని మలుపులు, ట్విస్టులపై తెగ మురిసి పోయారని సమాచారం.
ఇక ‘దృశ్యం 3’ ప్రారంభానికి ముందు, అజయ్ దేవ్‌గన్ ‘దే దే ప్యార్ దే 2’, ‘ధమాల్ 4’ మరియు ‘రేంజర్’ సినిమాలను పూర్తి చేయనున్నారు. ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్ ఇప్పటికే జరుగుతుండగా.. మార్చిలో ‘ధమాల్ 4’, మేలో ‘రేంజర్’ షూటింగ్ మొదలుకానుంది. ఈ ప్రాజెక్టుల తర్వాత ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్ళనుంది.
అంతేకాదు, ‘దృశ్యం 3’ అనంతరం అజయ్ దేవ్‌గన్ ‘గోల్‌మాల్ 5’ లో కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్టింగ్ దశలో ఉండటంతో, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే, అజయ్ దేవ్‌గన్ ఈ ఏడాది మే 1న విడుదల కానున్న ‘రైడ్ 2’లో కనిపించనుండగా, జూలైలో ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.