'వార్ 2' మేనియా స్టార్ట్

బాలీవుడ్‌ స్పై యూనివర్స్‌లోని అతి పెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటి 'వార్ 2'. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్-హృతిక్ లీడ్ రోల్స్‌లో అలరించబోతున్నారు.;

By :  S D R
Update: 2025-08-12 00:57 GMT

బాలీవుడ్‌ స్పై యూనివర్స్‌లోని అతి పెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటి 'వార్ 2'. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్-హృతిక్ లీడ్ రోల్స్‌లో అలరించబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 14న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా విడుదలవుతుంది.

చాలా రోజులుగా 'వార్ 2'లో విలన్ ఎవరనే ప్రశ్న సినీ లవర్స్‌లో ఆసక్తిని పెంచుతుంది. తారక్, హృతిక్‌లో ఒకరు నెగటివ్‌ రోల్‌లో ఉంటారని ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా యష్ రాజ్ ఫిలింస్ ఆ సస్పెన్స్‌ను క్లియర్ చేసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించేది 'యానిమల్'తో సూపర్‌స్టార్ స్టేటస్ అందుకున్న బాబీ డియోల్ అనే ప్రచారం జరుగుతుంది.

లేటెస్ట్ గా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తారక్, హృతిక్ ఇద్దరూ సినిమాపై తమ కాన్ఫిడెన్స్‌ను పంచుకున్నారు. తారక్ మాట్లాడుతూ, 'ఈసారి ఒక్కటే కాదు.. రెండు కాలర్స్ ఎగరేస్తాం!' అని చెప్పడంతో ఫ్యాన్స్ ఉత్సాహం డబుల్ అయిపోయింది. టెంపర్ నుండి దేవర వరకు తారక్ మాట వమ్ము కాలేదనే ట్రాక్ రికార్డ్‌తో, ఈసారి కూడా అదే మంత్రం పనిచేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

హృతిక్ రోషన్ జోడీగా నటిస్తూ కియారా గ్లామర్ టచ్ ఇచ్చింది. అయితే, ఆమె బికినీ సీన్ సెన్సార్ కత్తెర బారిన పడిందనే రూమర్స్ ఫ్యాన్స్‌లో మిక్స్‌డ్ రియాక్షన్స్ క్రియేట్ చేశాయి. తారక్, హృతిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై ఆడ్రినలిన్ లెవెల్‌లో ఉంటాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు. 'వార్ 2' దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు ముస్తాబవుతుంది.

Tags:    

Similar News