అక్టోబర్ నుంచి సెట్స్‌లో వెంకీ

మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ లను ఒకే ఫ్రేములో కలిసి చూసే అవకాశాన్ని అందించబోతుంది 'మన శంకరవరప్రసాద్ గారు'. గతంలో 'త్రిమూర్తులు' చిత్రంకోసం వెంకటేష్ తో అప్పటి తెలుగు అగ్ర కథానాయకులంతా ఒక పాటలో సందడి చేశారు.;

By :  S D R
Update: 2025-09-22 02:35 GMT

మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ లను ఒకే ఫ్రేములో కలిసి చూసే అవకాశాన్ని అందించబోతుంది 'మన శంకరవరప్రసాద్ గారు'. గతంలో 'త్రిమూర్తులు' చిత్రంకోసం వెంకటేష్ తో అప్పటి తెలుగు అగ్ర కథానాయకులంతా ఒక పాటలో సందడి చేశారు. ఆ తర్వాత చిరంజీవి-వెంకటేష్ కలయికలో మల్టీస్టారర్ ప్లాన్ చేసినా కుదురలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఈ స్టార్స్ ఇద్దరినీ కలుపుతున్నాడు.

చిరు 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీలో ఎక్స్‌టెండెడ్ కేమియోలో మురిపించబోతున్నాడు వెంకీ. అక్టోబర్ 20 నుంచి ఈ సినిమా సెట్స్ లో వెంకీ జాయిన్ అవుతాడట. ఈ షెడ్యూల్ లో చిరు-వెంకీ లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట.

ఇక నవంబర్ లో ఈ స్టార్స్ ఇద్దరి మధ్య ఒక పాట చిత్రీకరణ కూడా చేయనున్నారట. ఈ పాటలో ఇద్దరు స్టార్స్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా ఉండబోవడం లేదని ఇప్పటికే వినిపిస్తున్న టాక్. మొత్తంగా.. వచ్చే సంక్రాంతి కానుకగా రాబోతున్న 'మన శంకరవరప్రసాద్ గారు' మెగాస్టార్ కి మంచి కమ్‌బ్యాక్ అవుతుందని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Tags:    

Similar News