మహేష్ మూవీలో బాలీవుడ్ స్టార్?

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తుండగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.;

By :  S D R
Update: 2025-09-21 11:14 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తుండగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ గా కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది.

ఈ సినిమా కథకి వారణాసికి లింక్ ఉంటుందట. అందుకోసం ఈ చిత్రంకోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ వేశారనేది సమాచారం. ఇక ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే వారణాసి ఎపిసోడ్ లో రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడట. ఆ క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతుంది.

జక్కన్న గత చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'లో రణ్‌బీర్ భార్య అలియా నటించింది. అలాగే.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ క్యారెక్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు SSMB29లోనూ రణ్‌బీర్ కి అలాంటి తరహా క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు టాక్. నవంబర్ లో రిలీజయ్యే ఈ మూవీ ఫస్ట్ లుక్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News