'వీరమల్లు' సెన్సార్ కంప్లీట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియడ్ యాక్షన్ ఎపిక్ 'హరిహర వీరమల్లు'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియడ్ యాక్షన్ ఎపిక్ 'హరిహర వీరమల్లు'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. జ్యోతికృష్ణ, క్రిష్ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. 2 గంటల 42 నిమిషాల నిడివితో 'వీరమల్లు' రాబోతున్నట్టు తెలుస్తోంది.
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపధ్యంలో వీరమల్లు అనే యోధుడి ధైర్య, ధర్మ యుద్ధ కథగా ఈ చిత్రం రూపొందింది. చారిత్రక నేపథ్యంలో భారీ యుద్ధ సన్నివేశాలతో రాబోతున్న ఈ సినిమాలో హాస్యానికి పెద్ద పీట వేశారట. ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ విభిన్న అనుభూతిని అందించబోతోందని సెన్సార్ బోర్డు ప్రశంసలు అందించినట్టు యూనిట్ టాక్.
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో అలరించనున్నాడు. బాబీ డియోల్ విలన్‌గా నటించగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ఆస్కార్ అవార్డ్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
జూలై 20న వైజాగ్ లో ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకి చీప్ గెస్ట్ గా హాజరుకానున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో జూలై 24న 'హరిహర వీరమల్లు' విడుదల కాబోతుంది. ఇప్పటికే USAలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అద్భుత రెస్పాన్స్ దక్కుతుంది. మొత్తంగా.. యాక్షన్, విజువల్స్, ఎమోషన్స్ సమ్మేళనంగా రూపొందిన 'హరిహర వీరమల్లు' చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎలాంటి విజువల్ ట్రీట్ అందిస్తుందో చూడాలి.