టాలీవుడ్ స్టార్స్ ఆన్ సెట్స్!
ప్రస్తుతం తెలుగు సినిమాల షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుగుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో ఉంటుంది. మరి.. చిరంజీవి నుంచి తేజ సజ్జ వరకూ మన టాలీవుడ్ హీరోల సినిమాలు ప్రస్తుతం ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూద్దాం.;
ప్రస్తుతం తెలుగు సినిమాల షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుగుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో ఉంటుంది. మరి.. చిరంజీవి నుంచి తేజ సజ్జ వరకూ మన టాలీవుడ్ హీరోల సినిమాలు ప్రస్తుతం ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 3వ షెడ్యూల్ హైదరాబాద్ షామీర్ పేట్ లో జరుగుతుంది. ఇటీవలే రెండో షెడ్యూల్ ను ముస్సోరీలో కంప్లీట్ చేసిన టీమ్ ఇప్పుడు థర్డ్ షెడ్యూల్ ని షురూ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుంది. మరో కీలక పాత్రలో కేథరిన్ కనిపించబోతుంది.
మొన్నటివరకూ ‘రాజా సాబ్‘ను పూర్తి చేసిన ప్రభాస్ మళ్లీ ‘ఫౌజీ‘ షూటింగ్ లోకి ఎంటరయ్యాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ సినిమాలో ఓ సోల్జర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 షూటింగ్ శంకరపల్లి కల్కి స్టూడియో లో జరుగుతుంది. ఇక్కడ వారణాసి ఎపిసోడ్స్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మూవీ టీమ్ కెన్యాలో కొత్త షెడ్యూల్ కి రెడీ కానుంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోవైపు బాలకృష్ణ బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2‘ కూడా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. రామ్ పోతినేని తో మహేష్ బాబు.పి డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇక సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు‘ సినిమా షూటింగ్ తుక్కుగూడ లో జరుగుతుంది.
తేజ సజ్జా ‘మిరాయ్‘ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా కోన నీరజ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా గండిపేట ఏరియాలో జరుగుతుంది. నవీన్ పోలిశెట్టితో మారి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు‘ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది. ఇక నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‘ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.