'హరిహర వీరమల్లు' ట్రైలర్ వచ్చేస్తోంది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'హరిహర వీరమల్లు' మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'హరిహర వీరమల్లు' మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 3న ఉదయం 11:10కి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మొఘల్ కాలంలో ఓ విప్లవ యోధుడి కథగా ఈ సినిమా రూపొందింది. ప్రజల పక్షాన నిలబడి పాలకులపై తిరుగుబాటు చేసిన వీరమల్లుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అలరించనున్నాడు. దర్శకులు క్రిష్ – జ్యోతికృష్ణ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటించగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా కనిపించనుంది. ఇక సినిమాను జూలై 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా మరో ఐదు రోజుల్లో రాబోయే ట్రైలర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.