'వార్ 2' కౌంట్‌డౌన్ షురూ!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హాలీవుడ్ హై వోల్టేజ్ మూవీస్ కి ధీటుగా యష్ రాజ్ స్పై యూనివర్శ్ మూవీస్ అలరిస్తుంటాయి.;
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హాలీవుడ్ హై వోల్టేజ్ మూవీస్ కి ధీటుగా యష్ రాజ్ స్పై యూనివర్శ్ మూవీస్ అలరిస్తుంటాయి. ఈ సిరీస్ లో ఆరవ చిత్రంగా రాబోతుంది 'వార్ 2'.
సౌత్ స్టార్ ఎన్టీఆర్.. నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఇది. ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ గా నటించగా, ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఆగష్టు 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. లేటెస్ట్ గా 'మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి' అంటూ 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, హృతిక్, కియారా ముగ్గురూ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.