హృతిక్‌పై తారక్ డామినేషన్

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ల కలయికలో రూపొందిన మల్టీస్టారర్ 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.;

By :  S D R
Update: 2025-08-04 00:42 GMT

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ల కలయికలో రూపొందిన మల్టీస్టారర్ 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం, ‘వార్ 2’లో డామినేషన్ మాత్రం తారక్‌దే అంటోంది బాలీవుడ్ మీడియా. కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుందని, ఆయన నటన హృతిక్‌ని డామినేట్ చేస్తుందని నెట్‌ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పైగా, ఎన్టీఆర్‌కి ఈ సినిమాలో రూ.60 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వగా, హృతిక్‌కి రూ.48 కోట్లు మాత్రమే ఇచ్చారన్న వార్త ఫ్యాన్స్‌కి మరింత కిక్ ఇచ్చింది.

తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. తెలుగు థియేట్రికల్ హక్కులకు రూ.80 కోట్లు చెల్లించినట్టు టాక్. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో రూ.130-140 కోట్లు గ్రాస్ వసూలు చేయాలన్న టార్గెట్ ఉండటంతో, స్పెషల్ ప్రీమియర్ షోలు, అధిక టికెట్ ధరలపై పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఏపీలో స్పెషల్ షోలు పెద్దగా ఇబ్బంది లేకుండా వేయగలుగుతారు. తెలంగాణలో మాత్రం స్పెషల్ షోల అనుమతులపై స్పష్టత అవసరం. ప్రీమియర్లు పకడ్బందీగా జరిగితే 'వార్ 2' ఓపెనింగ్స్ విషయంలో చరిత్ర సృష్టించే ఛాన్స్ ఉంది. మరోవైపు 'వార్ 2' చిత్రానికి అదే రోజు రజనీకాంత్ ‘కూలీ’ నుంచి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ ఏర్పడనుంది. కానీ ఎన్టీఆర్ పాత్రపై వచ్చే టాక్ బట్టి తెలుగు మార్కెట్‌లో 'వార్ 2' దూసుకుపోతుందన్న ఆశాభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News