సూర్య 46 ముహూర్తం

విలక్షణ నటుడు సూర్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో సినిమా అధికారికంగా ప్రారంభం అయ్యింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.;

By :  S D R
Update: 2025-05-19 07:23 GMT

విలక్షణ నటుడు సూర్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో సినిమా అధికారికంగా ప్రారంభం అయ్యింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ముహూర్తానికి మాటల మాంత్రికుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

సూర్య 46వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ‘ప్రేమలు‘ ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో రవీనా టాండన్, రాధిక కనిపించనున్నారు.

జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

‘రక్తచరిత్ర‘ తర్వాత సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మే చివరి నుంచి పట్టాలెక్కే ఈ చిత్రం వచ్చే వేసవి కానుకగా విడుదలకు ముస్తాబవుతుంది. ఇప్పటికే ‘సార్‘తో ధనుష్ కి, ‘లక్కీ భాస్కర్‘తో దుల్కర్ సల్మాన్ కి భారీ విజయాలందించిన వెంకీ అట్లూరి.. ఈ సారి సూర్యకి మరో బంపర్ హిట్ అందించడానికి రెడీ అవుతున్నాడు.



Tags:    

Similar News