సక్సెస్ టూర్ లో ‘శుభం‘ టీమ్

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన మొదటి చిత్రం ‘శుభం‘. ‘సినిమాబండి‘ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ సెటైరికల్ ఫ్యామిలీ డ్రామా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.;

By :  S D R
Update: 2025-05-10 08:04 GMT

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన మొదటి చిత్రం ‘శుభం‘. ‘సినిమాబండి‘ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ సెటైరికల్ ఫ్యామిలీ డ్రామా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన హీరో వివాహం తర్వాత మొదటి రాత్రి సమయంలో భార్య సీరియల్ బానిసగా మారిన విషయం తెలిసి షాక్ అవుతాడు. ఇదే పరిస్థితి ఊరంతా ఉన్న మహిళల్లో చోటు చేసుకుంటుంది. ఈ విచిత్ర పరిణామాల వెనక కారణమేంటో తెలియజేసే హాస్యంతో కూడిన ప్రయాణమే ఈ కథ. వినూత్నమైన ఈ కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ఆడియన్స్ ను టచ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

సమంత స్వయంగా ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. హర్షిత్ రెడ్డి, గంగవ్వ, చరణ్ పెరీ, శ్రీయా కొంతం.. ఇలా వీరంతా కొత్తవారే అయినా నటీనటులు సరైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తంగా రూ.3.5 కోట్లు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రూ.8 కోట్లు సాధించిందనే అంచనాలు ఉన్నాయి.

ఓటీటీ, శాటిలైట్ వంటి నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా కలుపుకుంటే రిలీజ్ కు ముందే ‘శుభం‘ టేబుల్ ప్రాఫిట్ అందించదనేది ఇండస్ట్రీ టాక్. ఇక ‘శుభం‘ కలెక్షన్ల విషయానికొస్తే.. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.1.5 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. అమెరికాలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి.

‘శుభం‘ సినిమాకి అంతటా మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈరోజు విజయవాడ, గుంటూరు లలో మూవీ టీమ్ సందడి చేయబోతుంది. సమంతతో పాటు మిగతా నటీనటులు ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని కేపిటల్ సినిమాస్ లోనూ, గుంటూరు లో రాత్రి 7 గంటలకు మైత్రీ సినిమాస్ లోనూ సందడి చేయబోతున్నారు.

Tags:    

Similar News