చరణ్ ఫ్యాన్స్ కు శిరీష్ క్షమాపణ!
‘గేమ్ ఛేంజర్’ గురించి లేటెస్ట్ గా నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. రామ్ చరణ్, శంకర్ తమకు ఫోన్ చేయలేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించగా, మెగా అభిమానులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.;
‘గేమ్ ఛేంజర్’ గురించి లేటెస్ట్ గా నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. రామ్ చరణ్, శంకర్ తమకు ఫోన్ చేయలేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించగా, మెగా అభిమానులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
శిరీష్ వ్యాఖ్యలపై స్పందించిన రామ్ చరణ్ ఫ్యాన్స్, 'ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక' అంటూ ఓ లేఖను విడుదల చేశారు. 6 పాయింట్లతో ప్రశ్నలు లేవనెత్తుతూ, మరోసారి చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధ్యతను హీరోలపై వేయడం తగదని, ఇతర ఫ్లాప్ సినిమాల విషయంలో నిర్మాతలు అలా స్పందించలేదని, రామ్ చరణ్ 3 సంవత్సరాలు డెవోటెడ్‌గా గడిపిన తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ వివాదం చిలికి చిలికి పెద్దదవుతుండగా, దీనిపై ఇప్పటికే దిల్ రాజు స్పందించడం.. ఆ తర్వాత శిరీష్ కూడా మెగా ఫ్యాన్స్ కు సారీ చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై శిరీష్ క్షమాపణ చెబుతూ లేఖ విడుదల చేశారు..!