బోల్డ్ టైటిల్ తో వస్తోన్న సిద్ధు
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త సినిమా 'బాడాస్' ని అధికారికంగా ప్రకటించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు.;
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త సినిమా 'బాడాస్' ని అధికారికంగా ప్రకటించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.
‘మీరు ఇప్పటివరకు హీరోలను, విలన్‌లను చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు వారికి మించి చూస్తారు’’ అనే బోల్డ్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అవుతోంది. ‘If middle finger was a man‘ అన్న స్టేట్మెంట్ పోస్టర్‌కు అదనపు హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ కేవలం నటుడిగానే కాకుండా రచయితగా కూడా వ్యవహరిస్తున్నాడు.
గతంలో 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో సక్సెస్ అందుకున్న సిద్ధు-రవికాంత్ కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల 'జాక్' సినిమాతో వచ్చిన సిద్ధు ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరోవైపు ప్రస్తుతం సిద్ధు నటిస్తున్న 'తెలుసు కదా' చిత్రం సెట్స్ పై ఉంది.