‘రాజా సాబ్‘ రిలీజ్ డేట్ ఫిక్స్!
రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ది రాజా సాబ్‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.;
రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ది రాజా సాబ్‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఈ మూవీ నుంచి ప్రభాస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు డార్లింగ్.
మరోవైపు జూన్ 16న ‘రాజా సాబ్‘ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో మెరవబోతుండగా.. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ ఫీమేల్ లీడ్స్ గా కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
మొత్తంగా.. ఈమధ్య కాలంలో ప్రభాస్ నుంచి వరుసగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ వస్తున్నాయి. ‘ది రాజా సాబ్‘లో మాత్రం ప్రభాస్ లోని రొమాంటిక్ యాంగిల్ తో పాటు కామెడీ యాంగిల్ ను బాగా ఎలివేట్ చేయబోతున్నాడట మారుతి. ‘సలార్, కల్కి‘ తర్వాత ఇప్పుడు ‘ది రాజా సాబ్‘తో రెబెల్ స్టార్ హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.