ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా ‘ది రాజా సాబ్‘ వస్తుండగా.. ఆ తర్వాత ‘ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2‘ లైన్లో ఉన్నాయి.;

By :  S D R
Update: 2025-09-16 06:31 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా ‘ది రాజా సాబ్‘ వస్తుండగా.. ఆ తర్వాత ‘ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2‘ లైన్లో ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలతో పాటుగా లేటెస్ట్ గా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట డార్లింగ్. చాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబో ఫిక్సైనట్టు ఫిల్మ్ నగర్ టాక్.

‘హనుమాన్‘ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్‘ను అనౌన్స్ చేశాడు. అలాగే రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా ప్రకటించాడు. ఆ తర్వాత బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తోనూ సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. ఇక ఓపెనింగ్ జరుగుతుంది అనుకునే సమయంలో మోక్షజ్ఞ సినిమాకి బ్రేకులు పడ్డాయి. అయితే.. ఈసారి ప్రభాస్ తో మాత్రం సినిమాకి పక్కాగా ఫిక్స్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది.

కొన్నాళ్లుగా ప్రభాస్ సినిమాకి సంబంధించి మొత్తం స్క్రిప్ట్ పనులతో పాటు.. ప్రీ-విజువలైజేషన్ వర్క్ కూడా పూర్తి చేశాడట ప్రశాంత్ వర్మ. మైథాలజీ, ఫాంటసీ మేళవింపుతో ఈ చిత్రం తెరకెక్కనుందట. అప్పట్లో రణ్ వీర్ సింగ్ కోసం అనుకున్న ‘బ్రహ్మరాక్షస్‘ సబ్జెక్ట్ నే ఇప్పుడు ప్రభాస్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Tags:    

Similar News