వంద కోట్ల దిశగా ‘మిరాయ్‘
యంగ్ హీరో తేజ సజ్జా మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ‘హనుమాన్‘ సక్సెస్‌తో స్టార్ రేసులోకి ఎంటర్ అయిన తేజ, తాజా చిత్రం ‘మిరాయ్’తో తన స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు.;
యంగ్ హీరో తేజ సజ్జా మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ‘హనుమాన్‘ సక్సెస్‌తో స్టార్ రేసులోకి ఎంటర్ అయిన తేజ, తాజా చిత్రం ‘మిరాయ్’తో తన స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న విడుదలై మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలి రోజు రూ.27.2 కోట్లు, రెండో రోజు రూ.28.4 కోట్లు, మూడో రోజు రూ.25.6 కోట్లు వసూలు చేసి, టైర్ 2 హీరోలలో ఇప్పటివరకు ఎవరూ సాధించని రికార్డ్‌ను తేజ సృష్టించాడు. ముఖ్యంగా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రూ.8.20 కోట్ల షేర్ తో నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య వంటి హీరోల హయెస్ట్ రికార్డులనూ దాటేశాడు.
ఈ సినిమాలో తేజ సజ్జ సూపర్ యోధుడిగా చేసిన పెర్ఫార్మెన్స్‌కి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. యాక్షన్ సీన్స్‌లో డూప్ లేకుండా చేసిన స్టంట్స్, కామెడీ టైమింగ్ రెండూ బాగా వర్కౌట్ అయ్యాయి. మరోవైపు విలన్‌గా నటించిన మంచు మనోజ్ పాత్రకూ సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. గౌర హరి అందించిన మ్యూజిక్ సినిమాకి అదనపు బలంగా మారింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 2 మిలియన్ డాలర్లకు చేరువలో ఉన్న ‘మిరాయ్‘, హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా తేజ సత్తా చాటింది. మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తరహాలో బాలీవుడ్ మార్కెట్‌లో ప్రభావం చూపిన హీరోగా తేజ పేరు నిలిచిపోయింది.