‘వార్ 2‘లో ఎన్టీఆర్ ఎంట్రీ అదుర్స్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2’. ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్ లో ఈ భారీ మల్టీస్టారర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.;

By :  S D R
Update: 2025-07-15 07:45 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2’. ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్ లో ఈ భారీ మల్టీస్టారర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అయన్ ముఖర్జీ డైరెక్షన్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో ఇది ఆరో చిత్రంగా రాబోతుంది.

ఇప్పటికే వచ్చిన టీజర్‌పై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ట్రైలర్‌తో అసలు హైప్ మొదలవుతుందనే నమ్మకంతో యష్ రాజ్ ఫిలిమ్స్ ఎదురు చూస్తోంది. జూలై 23-25 మధ్య ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇందులో హృతిక్-ఎన్టీఆర్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్సులే ప్రధాన హైలైట్ కానున్నాయట. ప్రత్యేకంగా రీడిజైన్ చేసిన ట్రైలర్‌లో ఇద్దరికీ ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చేలా ప్లాన్ చేసినట్టు టాక్.

ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లు ఆగస్టు మొదటి వారం నుంచి షురూ చేస్తారట. హైదరాబాద్, ముంబై లలో గ్రాండ్ ఈవెంట్లు, స్పెషల్ స్క్రీనింగ్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని ఆయన రూ.80-90 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా ‘వార్ 2‘ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాగవంశీ. ‘వార్ 2‘లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి థియేటర్లు హోరెత్తుతాయని నాగవంశీ చెబుతుండటంతో ఫ్యాన్స్ భారీ ఎగ్జైట్‌మెంట్‌లో ఉన్నారు.

Tags:    

Similar News