'వార్ 2'పై ఎన్టీఆర్ క్రేజీ అప్డేట్!

వచ్చే నెలలో పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీ 'వార్ 2'. సూపర్ హిట్ 'వార్' ఫ్రాంఛైజ్ లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది.;

By :  S D R
Update: 2025-07-07 13:45 GMT

వచ్చే నెలలో పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీ 'వార్ 2'. సూపర్ హిట్ 'వార్' ఫ్రాంఛైజ్ లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది.బాలీవుడ్ ప్రెస్టేజియస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ తో పాటు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.

నార్త్, సౌత్ సమ్మేళనంతో బడా మల్టీస్టారర్ గా రూపొందుతున్న 'వార్ 2' చివరి అంకానికి చేరుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తైనట్టు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 'వార్ 2' ప్రయాణం నుంచి ఎన్నో నేర్చుకున్నానని.. ముఖ్యంగా హృతిక్ రోషన్ తో కలిసి పనిచేయడం ఓ మధురానుభూతి అని ట్విట్టర్ లో తెలిపాడు తారక్.

అయాన్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా మలిచాడని.. ఆడియన్స్ కోసం ఓ పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ రెడీగా ఉందంటూ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు ఎన్టీఆర్. లేటెస్ట్ గా ఈ చిత్రంలో తారక్-హృతిక్ కాంబోలో చిత్రీకరించిన పాటతో 'వార్ 2' షూట్ పూర్తైనట్టు తెలుస్తోంది. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా 'వార్ 2' రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags:    

Similar News