సముద్రం ఒడ్డున మంతనాలు
మాస్ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇక సిల్వర్ స్క్రీన్ పై మాస్ ను ఎలివేట్ చేయడంలో మాస్టర్ ప్రశాంత్ నీల్.;
మాస్ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇక సిల్వర్ స్క్రీన్ పై మాస్ ను ఎలివేట్ చేయడంలో మాస్టర్ ప్రశాంత్ నీల్. వీరిద్దరూ కలిస్తే.. ఆడియన్స్ కు మాస్ ర్యాంపేజ్ గ్యారంటీ. రేపటి నుంచి అదే ప్రయత్నంలో దూసుకుతున్నారు ఈ మాస్ మాస్టర్స్.
ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకుంటుంది. ఈ షెడ్యూల్ లో తారక్ కూడా పాల్గొంటున్నాడు. ఈకోవలోనే హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హిందూ సముద్రం ఒడ్డున మంతనాలు జరుపుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది.
ఇప్పటికే సముద్రం నేపథ్యంలో ‘దేవర‘ కోసం ఓ రేంజులో చెలరేగిపోయాడు తారక్. ఇప్పుడు నీల్ సినిమాలోనూ సముద్ర నేపథ్యం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ‘రేపటి నుండి అన్నింటినీ నాశనం చేయడానికి రెండు మాస్ ఇంజన్లు సిద్ధంగా ఉన్నాయి.. ఎన్టీఆర్-నీల్ మూవీ హిందూ సముద్ర తీర ప్రాంతాలను కదిలించబోతుంది‘ అంటూ ఓ ట్వీట్ చేసింది టీమ్.