ప్రశాంత్ నీల్ సెట్స్ కు ఎన్టీఆర్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. ప్రశాంత్ నీల్ సినిమాకోసం కర్ణాటక బయలుదేరాడు తారక్. ఆదివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ తో పాటు మైత్రీ అధినేతలు నవీన్, రవిశంకర్ కూడా కనిపించారు.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. ప్రశాంత్ నీల్ సినిమాకోసం కర్ణాటక బయలుదేరాడు తారక్. ఆదివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ తో పాటు మైత్రీ అధినేతలు నవీన్, రవిశంకర్ కూడా కనిపించారు.
రేపటి (ఏప్రిల్ 22) నుంచి ప్రశాంత్ నీల్ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు తారక్. ఇప్పటికే 'వార్ 2'ని ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన ఎన్టీఆర్.. ఇప్పుడు పూర్తిగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమాకి 'డ్రాగన్' అనేది వర్కింగ్ టైటిల్ గా ఉంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. గ్లోబల్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్ ఎంతో రగ్గడ్ గా ఉండబోతుందట. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.