ప్రశాంత్ నీల్ విజన్ లో ఎన్టీఆర్.. షూటింగ్ షురూ!
ప్రశాంత్ నీల్ విజన్ లో ఎన్టీఆర్.. షూటింగ్ షురూ!మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోంది? అనే ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. ఆ సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు ఓ పోస్టర్ తో తెలిపారు మేకర్స్. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు లిఖించేందుకు 'ఎన్టీఆర్‌నీల్' రాబోతున్నారనే అర్థం వచ్చే రీతిలో ఈ పోస్ట్‌కు డిస్క్రిప్షన్ ఇచ్చారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేసేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడట ప్రశాంత్ నీల్. లేటెస్ట్ గా చిత్రబృందం విడుదల చేసిన షూటింగ్ పోస్టర్ చూస్తుంటే అదే అర్థమవుతుంది. సినిమాలోని ఎంతో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ కూడా షూట్ లో పాల్గొంటాడట. మరోవైపు ఎన్టీఆర్ 'వార్ 2'తోనూ బిజీగా ఉన్నాడు. తారక్-హృతిక్ కాంబోలో రూపొందుతున్న 'వార్ 2' ఈ ఏడాది ఆగస్టులో విడుదలకానుంది.