రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 'నాటు నాటు'!
తెలుగు సినిమా మళ్లీ ప్రపంచస్థాయిలో తన ప్రతిష్ఠను చాటుకుంది. ఆస్కార్‌ను అందుకున్న 'నాటు నాటు' పాటతో మొదలైన విజయయాత్ర తాజాగా లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ వరకు కొనసాగింది.;
తెలుగు సినిమా మళ్లీ ప్రపంచస్థాయిలో తన ప్రతిష్ఠను చాటుకుంది. ఆస్కార్‌ను అందుకున్న 'నాటు నాటు' పాటతో మొదలైన విజయయాత్ర తాజాగా లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ వరకు కొనసాగింది.తాజాగా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 'ఆర్.ఆర్.ఆర్' లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ జరిగింది.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నేతృత్వంలో రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా భాగస్వామ్యం కావడం విశేషం. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు 'ఆర్.ఆర్.ఆర్' త్రయం ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి హాజరవడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ చరణ్ ముందస్తుగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం, ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, ఆలింగనం, స్టేజిపై కనిపించిన బాండింగ్.. ఈ క్షణాలన్నీ వీరి అభిమానుల్లో భావోద్వేగాన్ని ప్రతిధ్వనించాయి. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదివరకు ‘బాహుబలి 2’ లైవ్ కాన్సర్ట్‌కు వేదికైన రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో రెండోసారి రాజమౌళి దర్శకత్వం వహించిన మరో చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ అరుదైన అవకాశం పొందింది.