ఈ వారం థియేటర్లలో సినిమాలు
వారం వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఇక ఈ వారం ఒక రీ రిలీజ్ తో పాటు.. రెండు స్ట్రెయిట్ మూవీస్ ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చేస్తున్నాయి.;
వారం వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఇక ఈ వారం ఒక రీ రిలీజ్ తో పాటు.. రెండు స్ట్రెయిట్ మూవీస్ ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చేస్తున్నాయి.
ముందుగా రీ-రిలీజ్ విషయానికొస్తే చిరంజీవి-శ్రీదేవి కలయికలో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సరికొత్తగా రీమాస్టర్ అయ్యి త్రీడిలో రిలీజవుతుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా 35 ఏళ్ల క్రితం మే 9, 1990న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్లీ మే 9న ఈ సినిమా విడుదలవుతుండటం విశేషం.
రేపు రిలీజవుతోన్న మరో చిత్రం 'సింగిల్'. కార్తిక్ రాజు దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా కేతిక శర్మ, ఇవానా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చాడు. గీతా ఆర్ట్స్ 2 పై అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్టార్ హీరోయిన్ సమంత తన 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం 'శుభం'. 'సినిమాబండి' ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో ఎక్కువగా నూతన నటీనటులు నటించారు. హారర్ కామెడీ జానర్ లో ఈ చిత్రం రేపు ఆడియన్స్ ముందుకు వస్తోంది.