వైల్డ్ లుక్ లో మోహన్ బాబు

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్త కథలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్‌లోనే కాకుండా పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది.;

By :  S D R
Update: 2025-09-27 05:47 GMT

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్త కథలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్‌లోనే కాకుండా పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ రిపీట్ అవ్వడం, గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద హైప్ రెట్టింపైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి విలక్షణ నటుడు మోహన్ బాబు ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది.

మోహన్ బాబు ‘ది ప్యారడైజ్‘లో నటించబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. ఈ సినిమాలో మోహన్ బాబు శికంజ మాలిక్ గా తన విలనిజాన్ని పంచబోతున్నారు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. బేర్ బాడీతో రక్తపు చేతులతో, మారణాయుధాలతో మోహన్ బాబు లుక్ ఎంతో వైల్డ్ గా కనిపిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 26న ‘ది ప్యారడైజ్‘ పాన్ వరల్డ్ రేంజులో రిలీజ్ కు రెడీ అవుతుంది.


Tags:    

Similar News