డైనోసార్స్ తో మహేష్ యాక్షన్?
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కాదు. పాన్ వరల్డ్ డైరెక్టర్. ‘ఆర్.ఆర్.ఆర్‘ సినిమాతోనే అంతర్జాతీయంగా అవార్డులు, రివార్డులు అందుకున్న జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబు తో SSMB29 ని గ్లోబల్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు.;
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కాదు. పాన్ వరల్డ్ డైరెక్టర్. ‘ఆర్.ఆర్.ఆర్‘ సినిమాతోనే అంతర్జాతీయంగా అవార్డులు, రివార్డులు అందుకున్న జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబు తో SSMB29 ని గ్లోబల్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు.
మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ కాస్ట్ తో పాటు.. అంతర్జాతీయంగా ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇక యాక్షన్ ను తెరకెక్కించడంలో రాజమౌళికి తిరుగులేదు. ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమా ఆద్యంతం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వంచరస్ గా రూపొందుతుండడంతో.. ఈ సినిమాలో జంతువులతో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతాయట.
‘ఆర్.ఆర్.ఆర్‘ కోసం పులితో ఎన్టీఆర్ చేసిన ఫైట్ ను ఎప్పటికీ మర్చిపోలేదు. అలాగే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో జంతువులతో వచ్చే యాక్షన్ ఓ రేంజులో గూస్ బంప్స్ తెప్పించింది. ఇప్పుడు SSMB29 లో సింహాలు, పులులు వంటి జంతువులతోనే కాదు.. మహేష్ ఏకంగా డైనోసార్స్ తో ఫైట్స్ చేస్తాడనేది ప్రెజెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్.
ఇప్పటివరకూ మహేష్ మూవీకి సంబంధించి టైమ్ లైన్ ను బయట పెట్టలేదు జక్కన్న. అయితే హాలీవుడ్ లో ప్రెజెంట్ టైమ్ లైన్లోకి డైనోసార్స్ ను తీసుకొస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ కోవలోనే SSMB29లోకి కూడా కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్స్ ను తీసుకు రాబోతున్నాడట. ఆ డైనోసార్స్ తో మహేష్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు.
ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలలో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టీమ్ త్వరలో ఆఫ్రికా వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 2027లో SSMB29 రిలీజ్ కు రెడీ అవుతుంది.