'కుబేర' ట్విట్టర్ రివ్యూ!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో నటించిన మల్టీ స్టారర్ ‘కుబేర’. ఈరోజు (జూన్ 20) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 'కుబేర' ప్రీమియర్స్ పూర్తయ్యాయి.;
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో నటించిన మల్టీ స్టారర్ ‘కుబేర’. ఈరోజు (జూన్ 20) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 'కుబేర' ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 'కుబేర' గురించి ఆసక్తికరమైన రివ్యూస్ వస్తున్నాయి. ఆ రివ్యూస్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
ప్రీమియర్ షోలు పూర్తయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా 'కుబేర' గురించి ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన స్పందన ప్రకారం, ‘కుబేర’ సినిమాకు పాజిటివ్ టాక్ లభించినట్టు స్పష్టమవుతోంది.
ధనుష్ నటన, నాగార్జున పాత్ర మేకింగ్, శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా, ఎమోషనల్ గా నడుస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ధనుష్ అమాయకత్వం, నాగార్జున పవర్‌ఫుల్ ప్రెజెన్స్ సినిమాకి బలంగా నిలిచాయని అంటున్నారు.
ధనుష్ తన క్యారెక్టర్‌లో పూర్తిగా ఒదిగిపోయి మరోసారి తన నటనా ప్రతిభను చాటాడని, కొన్ని సీన్లు అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మరోసారి ధనుష్ అవార్డ్ విన్నింగ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
నాగార్జున పాత్ర గురించి ‘సైలెంట్ పవర్’ అని అభివర్ణిస్తున్నారు. ఇంటర్వెల్ తరువాత అతని పాత్ర మరింత శక్తివంతంగా మారిందని, ప్రేక్షకుల నుంచి బలమైన రెస్పాన్స్ వస్తోందని చెబుతున్నారు. రష్మిక మరో కీలక పాత్రలో ఆకట్టుకుందని, ఆమె పెర్ఫార్మెన్స్ మూవీకి థర్డ్ లేయర్‌గా నిలిచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టెక్నికల్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి మంచి స్పందన వస్తోంది. కొన్ని సీన్లలో బీజీఎం సినిమాను మరో లెవెల్ పైకి తీసుకెళ్లిందని అభినందనలు వస్తున్నా, పాటల విషయంలో మాత్రం అంత గొప్పగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన సెన్సిబుల్ స్టైల్ ను మిస్ చేయకుండా, స్టార్స్‌ను బలంగా హ్యాండిల్ చేయగలిగాడని మెచ్చుకుంటున్నారు. మరోవైపు సినిమా నిడివి కొంచెం ఎక్కువగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా 'కుబేర'పై ఫైనల్ రివ్యూ మరికొద్ది సేపట్లో అందిస్తాం.