'డ్రాగన్' కోసం హ్యూజ్ సెట్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కర్ణాటకలోని కుమ్టా సమీపంలోని ధారేశ్వర్ రామనగిండి బీచ్ వద్ద, అద్భుతమైన ప్రకృతి నేపథ్యంలో భారీ సెట్ వేశారు. విస్తృతమైన సముద్ర తీరం, పచ్చని కొండలు ఉన్న ఈ లొకేషన్, షూటింగ్‌కి పర్ఫెక్ట్ అని చెప్పాలి.
ఇక ఈ సెట్ లో హెలికాప్టర్లు, ఇళ్ల సముదాయం, రైల్వే ట్రాక్‌లు, లోకోమోటివ్‌లు, భారీ ఆయుధాలు, ట్యాంకర్లు వంటి గ్రాండ్ ఎలిమెంట్స్ ఏర్పాటు చేశారు. నాన్‌స్టాప్‌గా ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనుండడం ప్రత్యేకం అని చెబుతున్నారు. తారక్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. ఓ స్పెషల్ నంబర్ లో శ్రుతి హాసన్ కనిపించనుందట. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ 'దేవర 2', ప్రశాంత్ నీల్ 'సలార్ 2' సినిమాలపై దృష్టి సారించనున్నారు.