నిర్మాతగా సమంతకు 'శుభం'

ప్రముఖ నటి సమంత నిర్మాతగా త్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన చిత్రం 'శుభం'.;

By :  S D R
Update: 2025-05-08 16:54 GMT

ప్రముఖ నటి సమంత నిర్మాతగా త్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన చిత్రం 'శుభం'. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్ లో 'శుభం' విడుదలవుతుంది.

ఈ సినిమాని నిర్మించడమే కాకుండా ఈ మూవీలో మతాజీ అనే పాత్రలోనూ సమంత కనిపించబోతుంది. ఇప్పటికే 'శుభం' ప్రమోషనల్ యాక్టివిటీస్ లోనూ సామ్ అదరగొట్టింది. ఇక 'శుభం' చిత్రం సమంతకు రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ సాధించి పెట్టిందట. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ గ్రూప్, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ పొందినట్లు సమాచారం. ఈ రెండు కీలక నాన్-థియేట్రికల్ డీల్స్‌ ద్వారానే సినిమా బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యిందని ట్రేడ్ వర్గాల అంచనా.

'శుభం' సినిమా కథ 2004లో భీమునిపట్నం నేపథ్యంతో సాగుతుంది. భార్యలు టీవీ సీరియల్స్‌కు బానిసలవ్వడం, ఆ తర్వాత విపరీతంగా ప్రవర్తించడం వంటి సంఘటనలతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. మరికొద్ది గంటల్లో 'శుభం' సినిమా ఎలా ఉండబోతుంది? అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.



Full View


Tags:    

Similar News