సిద్దు జోష్ కి ‘జాక్’పాట్?

వైవిధ్యభరిత పాత్రలతో, డిఫరెంట్ జానర్లలో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఈసారి 'జాక్' అనే స్పై యాక్షన్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.;

By :  S D R
Update: 2025-04-10 04:31 GMT

వైవిధ్యభరిత పాత్రలతో, డిఫరెంట్ జానర్లలో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఈసారి 'జాక్' అనే స్పై యాక్షన్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో మొదటి షోల నుండే మంచి ఆసక్తిని రేపుతోంది.

ఈ సినిమాలో దర్శకుడు భాస్కర్ తన సాదారణ ప్రేమకథల నుంచి వెరైటీగా కమర్షియల్ మాస్ ఫార్ములాకు షిఫ్ట్ అయ్యాడు. యాక్షన్, హ్యూమర్, దేశభక్తి, సెంటిమెంట్ – అన్నింటినీ కలిపి ఒక పక్కా కమర్షియల్ ప్యాకేజీగా ‘జాక్’ను తెరకెక్కించాడు. స్పై థ్రిల్లర్‌గా నడిచే కథ, బ్యాక్‌డ్రాప్‌లోని టెర్రరిస్ట్ ప్లాట్, హీరోగా జాక్ పాత్రలో సిద్ధు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసింది.

సిద్ధు జొన్నలగడ్డ తన సిగ్నేచర్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. ముఖ్యంగా టిల్లు టోన్‌లను గుర్తు చేసే డైలాగ్ డెలివరీ, హ్యూమరస్ ఎలిమెంట్స్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ విలువ పెంచాయి. వైష్ణవి చైతన్యతో ఆయన కెమిస్ట్రీ కూడా ఫ్రెష్‌గా అనిపించింది.

సాంకేతికంగా చెప్పాలంటే, సినిమాకి గ్లామర్ కలిపే మ్యూజిక్, విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్ మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. అచ్చు రాజమణి సంగీతం కథకు సరిపోయేలా ఉంది. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సీన్లు ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.

ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుంచి మిక్స్‌డ్ టాక్‌ ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ‘జాక్’ ఒక డిఫరెంట్ స్పై డ్రామాగా నచ్చుతుంది అనే రివ్యూస్ వస్తున్నాయి.

Tags:    

Similar News